12 May, 2026 | 12:24 AM

4 రాష్ట్రాల గుండా 3 కొత్త రైల్వే లైన్లు

29-08-2024 07:43 AM
  1. అంచనా వ్యయం రూ.6,456 కోట్లు 
  2. ఆర్థిక వ్యవహారాల మంత్రి వర్గ కమిటీ ఆమోదం

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): lన, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన 3 కీలకమైన కొత్త ప్రాజెక్టులను ఆమోదించింది. వీటి మొత్తం అంచనా వ్యయం సుమారు రూ. 6,456 కోట్లు. పీఎం -గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ-మోడల్ కనెక్టివిటీలో భాగంగా ఈ ప్రాజెక్టులను మంజూ రు చేశారు. ఇందులో ఒకటి మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు కాగా.. మిగతా రెండు కొత్త లైన్లు. రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ కల్పించడం ఈ కొత్త ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశం. ఈ 3 ప్రాజెక్టులు 4 రాష్ట్రాల్లోని 7 జిల్లాలను కవర్ చేస్తా యి.

ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో నెట్వర్క్‌ను మరో 300 కిలోమీటర్ల మేర విస్తరింపజేస్తాయి. ఈ ప్రాజెక్టులతో 14 కొత్త స్టేషన్లు నిర్మిస్తారు. కొత్తగా ఏర్పడిన నౌపాడా, ఈస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ అందుబా టులోకి వస్తుంది. సుమారు 1,300 గ్రామాలకు, 11 లక్షల జనాభాకు అనుసంధానం కల్పిస్తాయి.

మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టు సుమారు 1,300 గ్రామాలకు, 19 లక్షల జనాభాకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు, సిమెంట్, సున్నపురాయి వంటి వస్తు రవాణా కోసం ముఖ్యమైన మార్గాలుగా మారనున్నాయి. ఏటా 45 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణాకు ఈ రైల్వే లైన్ల వల్ల సాధ్యమవుతుంది.