9 August, 2026 | 11:21 AM

తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు

09-08-2026 10:39 AM

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శక్తి స్వరూపిణి, లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖశాంతులతో, ఐకమత్యంతో, సౌభాగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ, మన సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.