నా కుటుంబం కబ్జా చేసినట్లు చూపించండి.. నేనే దగ్గరుండి కూలగొట్టిస్తా..
హైదరాబాద్: ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో మీడియాతో పాయింట్ లో ముచ్చటించారు.సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లం రాజు నిర్మాణాన్నే తొలుత హైడ్రా కూల్చి వేసిందని.. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్ లో ఎందుకు ప్రస్తావించ లేదు అని కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. నిర్మాణాలకు అధికారులే అనుమతి ఇస్తారు. సర్పంచ్ లు కాదని పదేళ్లు మంత్రిగా పని చేసిన ఆయనకు తెలియదా? నా కుటుంబం కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చి వేయిస్తా నన్నారు. విద్యా సంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోం.
హైడ్రా హైదరాబాద్ కు మాత్రమే పరిమితం..
హైడ్రా హైదరాబాద్ కు మాత్రమే పరిమితం. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్, చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపునకే మొదటి ప్రాధాన్యం. 30 ఏళ్ల కింద కట్టిన అక్రమ నివాసమైనా సరే.. బీఆర్ఎస్ నేత హరీష్ రావు సిద్ధమైతే ఆయన నాయకత్వంలోనే చెరువుల ఆక్రమణలపై నిజ నిర్ధారణ కమిటీ వేస్తానన్నారు. హైడ్రా కూల్చి వేతలపై ఒత్తిళ్లు వస్తున్నాయి. అయినా వెనక్కు తగ్గేది లేదని సీఎం వ్యాఖ్యానించారు.






