13 May, 2026 | 3:57 AM

నిర్ధిష్ట ప్రణాళికతో హైడ్రా ముందుకెళ్లాలి

28-08-2024 02:57 PM

హైదరాబాద్: నిర్ధిష్ట ప్రణాళికతో హైడ్రా ముందుకెళ్లాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. చెరువులు, నాలాలు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను కూల్చాలని, కబ్జాదారులను గుర్తించి వారి జాబితా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒవైసీతో పాటు ఎంత పెద్దలున్న చర్యలు తీసుకోవాల్సిందే అని కూనంనేని పేర్కొన్నారు. హైదరాబాద్ లో కబ్జాలకు గురైన భూమి ఎంత..? అని, దీంతో పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసి అమ్మిన వారిపై కేసులు పెట్టాలన్నారు. రంగనాథ్ కు దూకుడు ఎక్కువ.. అంత దూకుడు మంచిది కాదని, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షేక్ బందగీ విగ్రహాలు పెట్టాలని కూనంనేని సాంబశివరావు తెలిపారు.