యాదగిరిగుట్ట అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
30-08-2024 05:00 PM
హైదరాబాద్: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలయ నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని పనుల వివరాలను అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆలయంలోని రాజగోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులను అర్ధాంతరంగా ఆపవద్దన్న సీఎం రేవంత్ వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని సూచించారు.






