12 August, 2026 | 3:48 PM

సాంకేతిక నైపుణ్యం ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూడం : సీఎం రేవంత్ రెడ్డి

18-06-2024 04:29 PM

హైదరాబాద్ :  ఐటీఐలను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐటీఐలను ఆధునీకరణ కోసం రూ.2,324.21 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఐటీఐలను అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసున్నట్టు ప్రభుత్వం నిర్ణయించింది. మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పరిశ్రమల అవసరాలు తీర్చేలా యువతను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రపంచ అవసరాలకు సరితూగేలా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

సమాజం చాలా వేగంగా ఆధునాతన టెక్నాలజీ వైపు వెళ్తోంది. మన విద్య విధానం 40 ఏళ్ల క్రితం పరిస్థితులకు సరిపోయేలా ఉందని సిఎం తెలపారు. మరిన పరిస్థితులకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకే ఏటీసీలు ఏర్పాటు చేసి ప్రైవేటు రంగంలోని ఇతర ఉద్యోగాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూడమని, నైపుణ్యం లేకుండా కేవలం సర్టిఫికెట్ ఉంటే.. ప్రయోజనం లేదన్నారు. సర్టిఫికెట్ తో పాటు నైపుణ్యం ఉంటేనే ఎక్కడైనా రాణించగలం. మధ్య తరగతి యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యం మని ఆయన తెలిపారు.  ఐటీఐలో ప్రవేశాల కోసం ఎంతో మంది పోటీ పడేలా తీర్చిదిద్దుతామన్నారు.