పట్నా ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
18-06-2024 04:56 PM
బిహార్ : పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో బాంబు కలకలం సృష్టించాయి. పట్నా విమానాశ్రయంలో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తులు ఎయిర్ పోర్టు అధికారిక మెయిల్ ఐడీకి పంపించారు. దీంతో బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు నిర్వహించి ఎయిర్ పోర్టు పరిసరాల్లో భద్రతను పెంచారు. ఈ విషయంపై స్పందించిన పట్నా విమానాశ్రయం డైరెక్టర్ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోసంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






