ఐటీఐలను ఏటీసీగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్ : ఐటీఐలను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐటీఐలను ఆధునీకరణ కోసం రూ.2,324.21 కోట్ల నిధులు మంజూరు చేసింది. మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్టంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసున్నట్టు ప్రభుత్వం నిర్ణయించింది. ఏటీసీలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం చేసుకుంది.
సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఆధునిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఏటీసీల్లో యువతకు శిక్షణ కోసం ఆధునాతన సామగ్రి, సాంకేతికత ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను నియమించింది. ఏటీసీల్లో ఏటా 15,860 మందికి 6 రకాల కోర్సుల్లో లాంగ్ టర్మ్ కోచింగ్, 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్ టర్మ్ కోచింగ్ అందిస్తామన్నారు. ప్రాజెక్టు వ్యయంలో టీటీఎల్ వాటా రూ.2016.25 కోట్లు ఉంటుందని, మల్లేపల్లి ఏటీసీల్లో శిక్షణ పొందిన వారికి దేశంలో ఎక్కడైనా టీటీఎల్ ఉద్యోగం వచ్చేలా తీర్చిదిదుతామన్నారు. దశాబ్దికాలంగా ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు ఆదరణ లేకుండా పోయాయన్నారు. ప్రభుత్వం చేపట్టే చర్యలతో ఐటీఐలు మళ్లీ కీలకంగా మారనున్నాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.






