కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
03-07-2024 11:24 AM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలవనున్నారు. ఖర్గే సమక్షంలో ఎంపీ కేకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన ఇప్పటికే రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.






