బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు
03-07-2024 12:10 PM
కరీంనగర్: అధికారులను విధులకు ఆటంకం కలిగించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా విద్యాశాఖాధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నిరసనకు దిగారు. కలెక్టర్ పమేలా సత్పతిని హాలు నుంచి బయటకు రానీయకుండా ఇతర జెడ్పీటీసీలతో కలిసి సమావేశ మందిరం తలుపు వద్ద కూర్చున్నారు. ఇతర సభ్యులతోనూ వాగ్వాదానికి దిగారు. సాయంత్రం జెడ్పీ సీఈవో శ్రీనివాస్ ఎమ్మెల్యేపై వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు కౌశిక్ రెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్ 221,126 (2) కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టం అమలులొకి వచ్చిన రెండవ రోజే కౌశిక్ రెడ్డి పై నమోదైంది.






