19-01-2026 12:04:36 PM
మేడారం, (విజయక్రాంతి): మేడారం మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా 251 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ పనులను ప్రారంభించడంతోపాటు, రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ సమావేశం మేడారంలో నిర్వహించారు. మంత్రివర్గ సహచరులతో కలిసి అధికారుల బృందం మొత్తం ఆదివారం మేడారం లోనే బస చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుటుంబ సభ్యులతో ఆదివారం రాత్రి మేడారం హరిత కాకతీయ హోటల్లో బసచేసిన సీఎం సోమవారం ఉదయం మేడారం గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులను ప్రారంభించి, పైలాన్ ఆవిష్కరించారు. అక్కడినుండి గద్దెల ప్రాంగణానికి చేరుకొని తనతో పాటు మనవడిని తులాభారం వేసుకుని ఎత్తు బంగారం సమర్పించారు. అనంతరం మంత్రివర్గ సహచరులతో కలిసి సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సహచరులను మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు. అనంతరం సీఎం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ బయలుదేరారు.