2 May, 2026 | 1:12 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

మల్లన్నసాగర్ నీళ్లు పెంచాలి.. చెరువు తూము విడుదల చేయాలి

13-03-2026 11:03 AM

మూడు గ్రామాల రైతుల రాస్తారోకో 

సిద్దిపేట రూరల్: మల్లన్నసాగర్ నుంచి వచ్చే 6ఆర్ కాలువ ద్వారా దమ్మచెరువు మీదుగా చింతమడక పెద్ద చెరువులోకి నీటి ప్రవాహాన్ని పెంచాలని, అలాగే చింతమడక(Chintamadaka) పెద్ద చెరువు తూము విడుదల చేసి అంకంపేట చెరువు క్రింద ఉన్న రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు.

లక్ష్మీదేవిపల్లి స్టేజి వద్ద సిద్దిపేట–ముస్తాబాద్ రహదారిపై(Siddipet-Mustabad Road) రైతులు ఆందోళన చేపట్టారు. సీతారాంపల్లి, అంకంపేట, లక్ష్మీదేవిపల్లి గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొన్నారు. పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీటి ప్రవాహం పెంచి చెరువులకు నీరు విడుదల చేయాలని రైతులు కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.