13 March, 2026 | 11:48 AM

ఆరోగ్యం ,సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలి : ఎమ్మెల్యే

13-03-2026 10:44 AM

తాండూరు,(విజయక్రాంతి): ఆరోగ్యం ,సంక్షేమం, అభివృద్ధి దిశగా తాండూర్ పట్టణం ముందుకు సాగాలని వికారాబాద్ జిల్లా తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజాపాలన_ 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా  పురపాలక సంఘం అధ్యక్షురాలు పట్లోళ్ల నీరజ, ఉపాధ్యక్షులు రజాక్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పాత మున్సిపల్ నుండి విలేమూన్స్ చౌరస్తా వరకు  పరుగు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశుభ్రమైన తాండూర్ దిశగా తాండూర్ ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికీ సహకరించాలనిఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతిరోజూవ్యాయామం,క్రీడలు, నడక, ఆటల ద్వారా శారీరక-మానసిక దృఢత్వం పెరుగడంతో పాటు మన నిత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు , రెవెన్యూ ,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.