13 March, 2026 | 12:59 PM

కాంగ్రెస్ మండల పార్టీ పీఠం దక్కేది... ఎవరికో?

13-03-2026 10:49 AM

బీసీ, ఎస్సీల మధ్యనే తారా ..పోటీ.

ఎంపికలు ఎమ్మెల్యే, జిల్లా నాయకుల నిర్ణయమే ..అంతిమం

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి  మూడవ సంవత్సరం  ప్రజా పాలన సాగుతున్న తరుణంలో, నూతన మండల పార్టీ కమిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం లో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుని పదవికి ,విపరీతమైన డిమాండ్ పెరిగింది. రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వ్ ఎదుట, మండల స్థాయి నుంచి బహుముఖ పేర్లను నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ల ముందు నుండి నేటి వరకు కూడా బీసీ అభ్యర్థి పదవి సాగుతుండడం జరిగింది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో తుంగతుర్తి మండల ప్రాంతంలో భారీ ఓట్ల మెజార్టీ వచ్చినప్పటికీ, మండలంలో సీనియర్లు, జూనియర్లు నాయకులను, కార్యకర్తలను, ఒక్కతాటిపై, నడిపించుటకు కొంత ఇబ్బందిగా మారిందని, చెప్పక తప్పదు. 

ప్రస్తుతం మండలంలో కాంగ్రెస్ పార్టీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన చింతకుంట్ల వెంకన్న, కలకోట్ల మల్లేష్, దాసరి శ్రీను పేర్లు ఈ సామాజిక వర్గంలో బలంగా వినిపిస్తున్నాయి. బీసీ వర్గానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, బండ రామారం గ్రామానికి చెందిన రేగటి రవి గౌడ్ పేరు గట్టిగా వినబడుతుంది అనడంలో సందేహం లేదు. ఎమ్మెల్యే ఎన్నికల ముందు నుండి, నేటి వరకు ఎమ్మెల్యే మందుల సామేలుకు, రాష్ట్ర, జిల్లా స్థాయి సీనియర్ నాయకులతో కలిసిమెలిసి ఉండి కలుపుకుపోతూ, పార్టీ అభివృద్ధిలో, గ్రామ అభివృద్ధిలో లక్షల రూపాయలు ఖర్చు చేసి, అన్నా అంటే నేనున్నానని కార్యకర్తలకు ముందుకు వచ్చి, తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ, మంచి గుర్తింపు పొందిన నాయకునిగా చెప్పవచ్చు. ఏది ఏమైనా అంతిమ నిర్ణయం, ఎమ్మెల్యే, రాష్ట్ర, జిల్లా నాయకుల ఆదేశాలతో నూతన అధ్యక్షుని పీటం ఎవరికి, ఏ వర్గానికి దక్కుతుంది, వేచి చూడాల్సిందే సుమా..