6 May, 2026 | 5:36 PM

Breaking News

సామల వారి వివాహ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ హాజరు   •   కోనరావుపేట పీఏసీఎస్ నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి… సీపీఐ ధర్నా   •   పంట సాగుపై రైతులకు అవగాహన   •   కోనరావుపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు –అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగండ్ల దీపక్ చౌదరి   •   పిఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఏగుల నరసింహులు,వైస్ చైర్మన్   •   కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నీడ కల్పించాలని ఇందిరమ్మ పథకం   •   రైతుల సేవకు పున:రంకితమవుతా   •   రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి   •  

కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ

06-05-2026 04:59 PM

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు అరగంట పాటు భేటీ అయ్యారు. దాదాపు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మెట్రో రెండో దశకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని సీఎం కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.

మెట్రోను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మెట్రో రెండో దశ డీపీఆర్ ను వెంటనే ఆమోదించాలని కేంద్రమంత్రిని(Union Minister Manohar Lal Khattar) కోరారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు-ఫ్యూచర్ సిటీ కారిడార్ ను ఫేజ్--3 కింద చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.