1 May, 2026 | 7:21 PM

Breaking News

నియోజకవర్గం స్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   కార్మికుల అభ్యున్నతికి సంక్షేమ పథకాల అమలు   •   శిశువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు   •   మేడే స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యేవరకు పోరాడుతాం.....   •   తిమ్మంపేటలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్   •   మే డే స్ఫూర్తితో లేబర్ వ్యతిరేక చట్టాలు రద్దుకు పోరాటం   •   విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి శ్రీధర్ బాబు   •   వెలిమినేడులో పేలిన రియాక్టర్‌.. 9 మంది కార్మికులకు గాయాలు   •   నిషేధిత క్రిమిసంహారక మందులు విక్రయిస్తే చర్యలు తప్పవు   •  

తప్పు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి : సీఎం రేవంత్ రెడ్డి

21-10-2024 06:02 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గోషామహల్‌లో నిర్వహించిన ఫ్లాగ్ డే పరేడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం అమర పోలీసు కుటుంబాలతో ప్రత్యేకంగా మాట్లాడారు.

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటనను ఉటంకిస్తూ, ప్రజల్లో విబేధాలు సృష్టించాలన్న సంఘ వ్యతిరేక శక్తుల చర్యలను నియంత్రించడంలో ప్రభుత్వం పోలీసులకు సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ఏ రాష్ట్రమైనా ప్రగతి పథంవైపు నడవాలంటే శాంతి భద్రతలు పరిరక్షణ అత్యంత కీలకమన్నారు. శాంతి భద్రతలను కాపాడటంలో నిరంతరం శ్రమిస్తున్నందుకు తెలంగాణ పోలీసు సిబ్బందికి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. తప్పు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. తప్పు చేసిన వారికి, చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్న వారికి మధ్య తేడా లేకుండా పోతుంది. తప్పు చేసే వారెవరైనా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

శాంతి భద్రతలు, మత సామరస్యం కాపాడడంలో పోలీసులకు ఎలాంటి వసతి సౌకర్యాలు లేనప్పటికీ హైదరాబాద్ నగరంలో మతసామరస్యాన్ని కాపాడటంలో ఎంతో శ్రమిస్తున్నట్లు సీఎం గుర్తు చేశారు. బాధితుల విషయంలో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలే తప్ప క్రిమినల్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు.  పోలీసు కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు విధి నిర్వహణలో అమరులైనా లేదా అంగవైకల్యం చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం పెంచుతున్నామన్నారు.

తమకు పోలీసు శాఖ, సిబ్బంది పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది. పోలీసులు ఆత్మగౌరవంతో బ్రతకాలి. కానీ మరొకరు చులకన చేసి మాట్లాడే అవకాశం ఇవ్వొద్దు. అప్పుడే సమాజంలో పోలీసుల గురించి గొప్పగా మాట్లాడుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.హోం గార్డు నుంచి డీజీపీ వరకు పోలీసు కుటుంబాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సైనిక్ స్కూల్ తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూలును ప్రారంభిస్తున్నామన్నారు. ఎలాంటి లోటురాకుండా పోలీసు కుటుంబాల పిల్లల భవిష్యత్తుకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.