కుటుంబ కలహాలతో వ్యక్తి ఊరి వేసుకొని ఆత్మహత్య
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామానికి చెందిన చల్ల సాయిలు (55) అనే వ్యక్తి కుటుంబ కలహాలతో ఇంట్లోనే దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ సీఐ తుల శ్రీధర్ తెలిపారు. సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం... సోమేశ్వర్ గ్రామానికి చెందిన సాయిలు మొదటి భార్య చనిపోవడంతో అందాజ 20 సంవత్సరాల క్రితం రెండవ పెళ్లి చేసుకున్నారు.
పెళ్లయినప్పటి నుండి భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండేవారు గత కొన్ని రోజుల నుండి భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు వచ్చి తరచుగా గొడవలు జరుగుతూ ఉండటంతో సాయిలు శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ పడుకున్న తర్వాత తన గదిలో తనకు తానుగా ఇంటి దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు సిఐ తెలిపారు.మృతుని మొదటి భార్య కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు.






