16 June, 2026 | 11:49 PM

తెలంగాణ ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

18-08-2024 11:09 AM

హైదరాబాద్ : తెలంగాణ ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహావీరుడికి నివాళి అర్పించారు. శతాబ్దాల కిందటే రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేదప్రజలను సంఘటితం చేసి, రాజకీయ-సామాజిక సమానత్వమే మూల సూత్రంగా గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తిగా సర్వాయి పాపన్న  చరితం అసామాన్యమైనదని ముఖ్యమంత్రి కొనియాడారు. సర్వాయి పాపన్న స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం వారి ఆశయాలను కొనసాగిస్తోందని ముఖ్యమంత్రి ఒక సందేశంలో తెలిపారు.