17 June, 2026 | 1:08 AM

హైదరాబాద్ చేరుకున్న అభిషేక్‌ మను సింఘ్వీ

18-08-2024 10:53 AM

హైదరాబాద్ : ఆదివారం రాత్రి 7 గంటలకు కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం జరుగనుంది. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశం కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతను ఈ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్విని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిచయం చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్‌ మను సింఘ్వీ హైదరాబాద్  చేరుకున్నారు.  శంషాబాద్ ఎయిర్ పోర్టులో సింఘ్వీకి  ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ స్వాగతం పలికారు. అభిషేక్‌ సింఘ్వీ నేరుగా కే.కేశవరావు నివాసానికి వెళ్లనున్నారు. అభిషేక్‌ సింఘ్వీ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.