రన్నింగ్‌లో ఊడిన టైర్లు.. స్పందించిన కేటీఆర్
18-08-2024 11:29 AM
హైదరాబాద్ : ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. 50 మంది ప్రయాణించాల్సిన బస్సులో 170 మంది ఎక్కారు. మోరపెల్లి వద్ద నిర్మల్ డిపో బస్సులో 170 మంది ప్రయాణిస్తున్న బస్సు వెనుక రెండు టైర్లు ఊడిపోయాయి. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. టైర్లు ఊడిపోయిన సమయంలో బస్సులో 170 మంది ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడం నిజంగా అదృష్టమే. ప్రభుత్వాన్ని నా ప్రశ్న ఏమిటంటే, మీరు అమాయక పౌరుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు?.. ప్రయాణికుల భద్రత కోసం ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా..?, ప్రయాణీకుల సంఖ్యను పరిమితం చేసే విషయంలో ఏదైనా భద్రతా ప్రోటోకాల్ అనుసరించబడుతుందా? అని ప్రశ్నించారు.






