14 May, 2026 | 6:14 PM

రేపు పాలమూరుకు సీఎం రేవంత్‌రెడ్డి

09-11-2024 12:37 AM

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సాలకు హాజరు

మహబూబ్‌నగర్, నవంబర్ 8 (విజయక్రాంతి):ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్నారు. జిల్లాలోని సీసీ కుంట మండలంలో శ్రీకురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సీసీకుంట మండలంలోని శ్రీకురుమూర్తి స్వామి ఆలయానికి సమీపంలో హెలీప్యాడ్ దిగేందుకుగాను ఎస్పీ జానకి, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి శుక్రవారం స్థల పరిశీలన చేశారు.