12-04-2025 12:43:36 AM
గజ్వేల్, ఏప్రిల్ 11 : గజ్వేల్ పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. గురువారం కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు గజ్వెల్ లో దేశ ప్రధాని మోడీ చిత్రపటాన్ని తగలబెట్టడాన్ని నిరసిస్తూ బిజెపి నాయకులు అయిల మహేందర్, బండారు మహేష్ ల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తో శవయాత్ర నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మకు దహనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్ మీద 50రూపాయాలు పెంచారని మోదీ చిత్రపటం దహనం చేసిన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మాట తప్పిన రేవంత్ రెడ్డిని ఎన్ని సార్లు తగల బెట్టాలని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో రెక్సీ గౌడ్, ప్రభాకర్,రాజు, స్వామి, గడ్డమీద ప్రశాంత్, మహిళా నాయకులు మమత, సరిత, భక్తమాల స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.