15 June, 2026 | 7:26 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •  

మెస్సీతో సీఎం రేవంత్ ఎగ్జిబిషన్ మ్యాచ్

30-11-2025 12:00 AM

హైదరాబాద్, నవంబర్ 29 : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. డిసెంబర్ 13 నుంచి 15 వరకూ మెస్సీ భారత్‌లోని నాలుగు ప్రధాన నగరాల్లో సందడి చేయనున్నాడు. కోల్‌కత్తా, ముంబై, న్యూఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోనూ మెస్సీ పర్యటించ బోతున్నా డు. కేరళ టూర్ రద్దు కావడంతో హైదరాబాద్‌కు అవకాశం దక్కింది.

డిసెంబర్ 13న హైదరాబా ద్‌కు రానున్న మెస్సీకి స్వాగతం పలికేందుకు ఇటు ప్రభుత్వం, అటు అభిమానులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ టూర్‌లో భాగం గా మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. ఉప్ప ల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కాబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టికెట్ల న్నీ హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. రూ. 1700 నుంచి రూ.18 వేల వరకూ టికెట్ ధరలున్నాయి.

ఈ ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో రేవంత్ ఆర్‌ఆర్9 జెర్సీతో బరిలోకి దిగుతారని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల జట్టుకు సీఎం రేవంత్ సారథ్యం వహించనుండగా.. మెస్సీ ఎల్‌ఎమ్ 10జెర్సీతో ఆడనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. అలాగే యువ ప్లేయర్స్‌కు ఫుట్‌బాల్ క్లినిక్, మ్యూజికల్ ప్రోగ్రాంతో పాటు మెస్సీ అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పా టు చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి మెస్సీ ప్రత్యేకంగా ట్వీట్ చేశాడు.