సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం
కొండపాక: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని శనివారం ఉమ్మడి కొండపాక మండల మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... అనారోగ్యం బారిన పడిన నిరుపేదలు, ఆర్థికంగా వెనుకబడిన వారు ప్రైవేట్ హాస్పిటల్ లో ఆరోగ్యం బాగు చేసుకున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు. కుకునూరుపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన అరబోయిన వరలక్ష్మి రూ 57,500, కొండ బాల్నగర్ రూ 55000, మల్లం రజిత రూ 24000, బండారి రాజు రూ 15000, అనబోయిన విగ్నేష్ రూ 22500 లకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ రెడ్డి, రవీందర్, ప్రవీణ్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.




