వర్షిత్ కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత
08-04-2026 07:06 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధి10వ డివిజన్ పీర్జాదిగూడ మాభవాని కాలనీ కి చెందిన పుల్కం వర్షిత్ కుటుంబానికి ప్రభుత్వం నుండి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును బుధవారం ఫిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పంపిణీ చేశారు. డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ప్రత్యేక చొరవతో ఈ చెక్కు మంజూరైందని. సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ పేదలకు కష్టకాలంలో ఆదుకుంటుంది అన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.




