8 April, 2026 | 8:53 PM

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి: దైద రవీంద్ర

08-04-2026 07:10 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నియోజకవర్గ ఇంచార్జ్ దైద రవీంద్ర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సూచనలతో నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల ముఖ్య సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఇంచార్జ్ రవీంద్ర మాట్లాడుతూ... ముఖ్యంగా మళ్లీ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్లు, కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్స్, కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యక్రమాల్ని, ప్రభుత్వ పథకాలను ప్రజలకి అర్థమయ్యేలా అవగాహన కల్పించేటట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలని దిశా నిర్దేశించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ గాదె చెన్నారావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రెహనా బేగం కమల్ పాషా వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత వేణు, సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, పట్టణ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.