28 February, 2026 | 10:53 AM

జల సేవకుడికి ఘన వీడ్కోలు

28-02-2026 12:39 AM

ఘనంగా సత్కరించిన మణికొండ ఫెడరేషన్, స్థానికులు

మణికొండ, ఫిబ్రవరి 27, (విజయక్రాంతి): మణికొండ ప్రాంతంలో నీటి సరఫ రా వ్యవస్థను గాడిలో పెట్టి, ప్రజల సమస్యల పరిష్కారంలో నిరంతరం శ్రమించిన హైదరాబాద్ జలమండలి  జనరల్ మేనేజర్ శ్రీనివాస రెడ్డి శుక్రవారం పదవీ విరమణ పొందారు. కేవలం ఒక ప్రభుత్వ అధికారిగానే కాకుండా, ప్రజలకు ఎల్లప్పుడూ అందు బాటులో ఉండే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న

ఆయనకు మణికొండ కాలనీల ఫెడరేషన్, స్థానికులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, ప్రతినిధులు రవీందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సింహ రాజా రెడ్డి, బాబురావు, కృష్ణ కుమార్, శంకర్ దేవ్, డాక్టర్ పి. అవినాష్, శ్రీనివాస్ రెడ్డి, రామయ్య, కిషన్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు.