ప్రజల ఆరోగ్యానికి సీఎంఆర్‌ఎఫ్ వరం
చేగుంట, మే 19: అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఒక వరం లాంటిదని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చేగుంటలోని అతిథి గృహంలో మండలానికి చెందిన 11మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి 5 లక్షల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్ష రూపాయలు పెంచడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మాసాయిపేట్ శ్రీనివాస్, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ వెంగళరావు, జనరల్ సెక్రెటరీ మహేష్, ఓబీసీ అధ్యక్షులు ఆంజనేయులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు,
ఎస్టీ సెల్ అధ్యక్షులు పకీర్ నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, ఫిషర్ అధ్యక్షులు సోమా వెంకటేష్, యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, సాయి కుమార్ గౌడ్, సండ్రుగు శ్రీకాంత్, పూర్రా ఆగం, జింక శ్రీనివాస్, వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.






