17 April, 2026 | 10:25 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం

03-05-2025 01:55 AM

ఎమ్మెల్యే బాలునాయక్

దేవరకొండ, మే 2: నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరమని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 205 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) రూ.68.78 లక్షల విలువైన చెక్కులను శుక్రవారం అందజేశారు. అనంతరం పలు మండలాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బాలునాయక్  మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గ వ్యాప్తంగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి పేదవాడికి ఆదుకోవాలనే సంకల్పంతో గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కూడా మంజూరు చేశామని స్పష్టంచేశారు.