30 June, 2026 | 8:23 PM

Breaking News

ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •   రమాదేవి సేవలు చిరస్మరణీయం   •   జమలాపురం శ్రీవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు   •   కామారెడ్డిలో గంజాయి పట్టివేత   •   సర్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్   •   సాదాసీదాగా కౌన్సిల్ సమావేశం   •  

5 నుంచి ఒక్కో మండలంలో రెవెన్యూ సదస్సులు

03-05-2025 01:53 AM

జిల్లా కలెక్టర్లతో వీ.సీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

నిజామాబాద్, మే 2 (విజయ క్రాంతి) : ఇందిరమ్మ ఇండ్లు నీట్ పరీక్ష 20 లోపు జరగనున్న సదస్సుల సమగ్ర అధ్యయనం జరిపిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు.

రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావుతో కలిసి మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ద్వారా భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏప్రిల్ 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో పైలట్ ప్రాతిపదికన రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని సూచించారు.

కబ్జాలకు, అన్యాక్రాంతానికి గురైన ప్రభుత్వ భూలను సైతం గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకుని పక్కాగా వాటి వివరాలను రికార్డులలో పొందుపర్చాలని ఆదేశించారు. కాగా, భూభారతి నూతన చట్టంపై రాష్ట్రంలో 605 మండలాలకు గాను ఇప్పటివరకు 590 మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగిందని, 85,527 మంది పౌరులు, 1,62,577 మంది రైతులు అవగాహన సదస్సులలో పాల్గొన్నారని మంత్రి వివరించారు. కా వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ కమిషనర్ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.