తీర్పు కావాలంటూ ఒత్తిడి చేయొద్దు
- వేలాదిమంది జీవితాలకు చెందిన అంశంలో తొందరపాటు వద్దు
- గ్రూప్-1పై విచారణ సందర్భంగా టీజీపీఎస్సీకి హైకోర్టు సూచన
- జూన్ 11కు వాయిదా
హైదరాబాద్, మే 2: గ్రూప్-1పై విచారణను వేగవంతంగా ముగించలేమ ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు పేర్కొన్నారు. వేలా ది మంది అభ్యర్థుల జీవితాలతో ముడిపడిన అంశంలో తొందరపడొద్దని, వెంటనే తీర్పు కావాలని ఒత్తిడి చేయొద్దని టీజీపీఎస్సీకి సూచించారు. గ్రూప్-1లో అవకతవకలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై గత కొన్ని రోజులుగా విచారణ జరుగుతుంది. శుక్రవారం పిటిషనర్ల తరఫున న్యాయవాది రచనారెడ్డి, టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపించారు. రీకౌం టింగ్‌లో ఓ అభ్యర్థికి 60 మార్కు లు తగ్గాయంటూ అభ్యర్థుల తరఫు న్యా యవాది రచనారెడ్డి కోర్టుకు విన్నవించారు. సదరు అభ్యర్థి జవాబు పత్రాలు కోర్టుకు సమర్పించాలని న్యాయమూ ర్తి ఆదేశించారు.
తదుపరి విచారణలో సమర్పిస్తామని టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది రాజశేఖర్ కోర్టుకు తెలిపారు. వెకేషన్‌లోగా స్టేపై నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెం చ్ చెప్పిందని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. దీంతో విచారణను వేగంగా ముగించలేమంటూ జస్టిస్ రాజేశ్వరరావు పేర్కొ న్నారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జూన్ 11 పొడిగిస్తున్నట్టు స్పష్టం చేశారు. తదుపరి విచారణ జూన్ 11న జరుగనుంది.






