14 July, 2026 | 11:45 AM

Breaking News

కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •  

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్ : దయాకర్ రెడ్డి

09-07-2026 01:53 AM
  1. మంత్రి పొంగులేటి సిఫారసుతో 75 మందికి చెక్కుల పంపిణీ
  2. రూ.27 లక్షల ఆర్థిక సాయం అందజేత

ఖమ్మం, జులై 7(విజయక్రాంతి):  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సిఫారసుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ జరిగింది. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 75 మంది లబ్ధిదారులకు సుమారు రూ.27 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.

మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి లబ్ధిదారులకు ఈ చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు, ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంలా మారిందని, మంత్రి పొంగులేటి చొరవతో ఉమ్మడి జిల్లాలోని ఎందరో నిరుపేదలకు వైద్య, ఆర్థిక సాయం అందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.