కోచింగ్‌పై వేటు!
- జేఈఈ, నీట్ కోచింగ్ కేంద్రాల నియంత్రణ తప్పనిసరి
- బడ్జెట్‌లో విద్యకు 18 శాతం కేటాయింపులుండాల్సిందే
- కొత్త రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఏర్పాటుచేయొద్దు
- యూజీ, పీజీల ఉత్తీర్ణత శాతం 50కి పెంచాలి
- ప్రభుత్వ టీచర్ల జీతాలు తగ్గించాలి
- పదోన్నతులు ఆటోమేటిక్‌గా ఇవ్వొద్దు
- జాతీయ నేతల విగ్రహాలు స్కూళ్లలో పెట్టొద్దు
- తెలంగాణ విద్యాకమిషన్ సిఫారసులను తప్పుబడుతున్న టీచర్ల సంఘాలు
హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల పేరుతో నిర్వహించే కోచింగ్ వ్యాపారం అంతా ఇంతా కాదు. ఆ కోచిం గ్ వ్యాపారాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది. ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వ నియంత్రణ కరువైంది. ఇబ్బడిముబ్బడిగా వెలిసిన, వెలుస్తున్న హాస్టళ్లపై కూడా నియంత్రణ అవసరం. ఇందుకు చట్టాలలో సవరణలు చేయాల్సి ఉంది.. తెలంగాణ విద్యాకమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో చేసిన సిఫారసు లు ఇవి.
ఫీజులు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, పాఠ్యప్రణాళిక, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, తప్పుదారి పట్టించే ప్రకటనలపై నియంత్రణ అవసరమని సూచించింది. ప్రైవేట్ జూనియర్ కాలేజీల నుంచి పోటీ పరీక్షల కోచింగ్‌ను వేరుచేయాలని తెలిపింది. అసలు ప్రైవేట్ కాలే జీల పేర్లతో నిర్వహించే కోచింగ్‌ను నిషేధించాలని కమిషన్ పేర్కొంది. అయితే ప్రైవేట్ విద్య నియంత్రణ అవసరం గురించి మంచి సూచనలే కమిషన్ చేసినప్పటికినీ ప్రభుత్వరంగానికి సంబంధించిన సిఫారసులను ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతకరంగా ఉన్నాయి.
దీంతో ప్రభు త్వ ఉపాధ్యాయులు కమిషన్‌పై భగ్గుమంటున్నారు. టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నా యని, వారి జీతభత్యాలను హేతుబద్ధీకరించాలని సిఫార్సు చేయడంపై టీచర్ సం ఘాల నేతలు మండిపడుతున్నారు. ఇంతటితో ఆగకుండా సర్కారు టీచర్లను కాం ట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని, బదిలీ లు, పదోన్నతులు ఆటోమెటిక్‌గా ఇవ్వొద ని సూచించడంతో ఉపాధ్యాయ సంఘా లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ బోర్డులను విలీనం చేసి, 12వ తరగతిలో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని, ఉత్తీర్ణత శాతాన్ని సైతం 45 శాతానికి పెంచాలని సిఫారసు చేయడాన్ని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు తప్పబడుతున్నాయి. పైగా ఎప్‌సెట్‌ను రద్దు చేయా లని సిఫారసు చేయడమేమిటని అవి ప్రశ్నిస్తున్నాయి.
ఫీజుల కట్టడి అవసరం..
రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా వ్యాపారమయమైంది. ఏడాదికి రూ. వేల కోట్ల వ్యాపారం విద్య పేరుతో నడుస్తోంది. రాష్ట్రంలోని ప్రైవే ట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల ఫీజు నియంత్రణ అవసరాన్ని విద్యాకమిషన్ ప్రస్తావించింది. రాష్ట్రంలో ఈ ఫీజు సమస్య ఎక్కువగా ఉంది. ఈ ఫీజులను నియంత్రించాలని నివేదికలో సూచించింది. అయితే ఫీజుల నియంత్రణను ఏ విధంగా చేపట్టాలో కూడా స్పష్టం చేసింది. అందుకు ప్రైవేట్ పాఠశాలలను ఐదు లేదా ఆరు కేటగిరీల్లో వర్గీకరించాలని తెలిపింది.
లొకేషన్, భూవిస్తీర్ణం, మౌలికవసతులు, ఎక్ట్రాకరికులర్ యా క్టివిటీస్, ఉపాధ్యాయుల అర్హతలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లాంటి అవంశాలను తీసుకోవాలని తెలిపింది. ప్రతి వర్గానికి గరిష్ఠ ఫీజును నిర్ణయించాలని, ఫీజు నియంత్రణ కమిషన్‌ను ఏర్పాటుచేయాలని సూ చించింది. ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ బిల్లు-2026 (ముసాయిదా బిల్లు) సిద్ధం చేసి కమిషన్ నివేదికను అనుబంధంగా సమర్పించింది.
సర్కారు విద్యకు 18 శాతం నిధులు..
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 18 శాతం నిధు లు కేటాయించాలని కమిషన్ సిఫారసు చేసింది. ప్రీప్రైమరీ, ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలు మౌలికవసతులు, కావాల్సిన సిబ్బం ది కలిగి ఉండాలని తెలిపింది. అయితే జాతీ య విద్యావిధానం(ఎన్‌ఈపీ కొన్ని అంశాలను స్వీకరించి, అశాస్త్రీయమైన అంశాలను పక్కన పెట్టొచ్చన్నది. ప్రస్తుతం 6 సంవత్సరాల వయస్సు వరకు అమలవుతున్న ఉచిత తప్పనిసరి విద్యను 3 నుంచి 18 సంవత్సరాలకు అంటే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విస్తరించాలని పేర్కొంది.
కొత్త గురుకులాలు వద్దు..
ప్రభుత్వ గురుకుల విద్యాలయాలకు సం బంధించి కమిషన్ పలు సిఫారసులు చేసింది. అయితే ఇకమీదట కొత్త రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేయకూడదని తెలిపింది. గిరిజన సంక్షేమ శాఖ కింద నడుపుతున్న మినీ గురుకులాలను (1-5 తరగతులు) రద్దు చేయాలని పేర్కొంది. ప్రస్తుతం అన్ని సొసైటీల పరిధిలో ఉన్న రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను రద్దు చేయాలని సూచించింది. దీంతోపాటు అన్ని రెసిడెన్షియల్ సంస్థలను తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీగా ఒక్క గొ డుగు కిందకు తేవాలని చెప్పింది. యూజీ, పీజీ ఉత్తీర్ణత శాతాన్ని 50కి పెంచాలని కమిషన్ తన నివేదికలో సూచించింది.
అనారోగ్య కారణాలతో బదిలీలొద్దు..
కొత్తగా టీచర్లను మండలం యూనిట్‌గా నియమించాలని కమిషన్ సూచించింది. అయితే ఇక నుంచి టీచర్ల బదిలీలు చేపట్టొద్దు అని, అనారోగ్య కారణాలతోనూ బదిలీలకు అవకాశం కల్పించొద్దు అని సూచించింది. కొత్తగా నియమితులైన వారుమాత్రం అదే గ్రామం, లేదంటే.. మండలం లోపల 15 కిలోమీటర్ల పరిధిలో మాత్రం పనిచేయాలి. ఇతర మండలాల వారు మరో మండలంలో టీచర్‌గా పనిచేయడానికి వీలులేదని సూచించింది. టీచర్లకు ఇచ్చే పదోన్న తులు ఆటోమెటిక్‌గా ఇవ్వొద్దని కమిషన్ సూచించింది.
ఒకవేళ ప్రైమరీ టీచర్ హై స్కూల్ టీచర్‌గా ఉద్యోగోన్నతి పొందాలంటే మళ్లీ కొత్త రిక్రూట్‌మెంట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇదివరకు పనిచేసిన కాలానికి 10 శాతం వెయిటేజీ అమల్లో ఉంటుందని, రాబోయే పదేండ్ల తర్వాత హెచ్‌ఎంలను 100 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో నియమించాలని సూచించింది. 45 ఏండ్ల లోపు ఉంటేనే పోటీ పడే అవకాశం కల్పించాలని, ఏ స్కూల్ హెచ్‌ఎం ఆ స్కూల్లో పనిచేయాలి, కానీ బదిలీ చేయొద్దు అని సూచించింది.
బడుల్లో జాతీయ నేతల విగ్రహాలు ఉండొద్దు..
సర్కారు బడుల్లో ఏకంగా జాతీయ నేతల విగ్రహాలు పెట్టవద్దు అని కమిషన్ కీలక సూ చనలు చేసింది. అంతేకాకుండా పాఠశాల అటెండెన్స్ రిజిస్టర్లల్లో ఎస్సీ, ఎస్టీ కులాల ప్రస్తావన ఉండొద్దు అని తెలిపింది. పైగా పాఠశాలల్లో జాతీయ, అంతర్జాతీయ ఎన్జీవో సంస్థల భాగస్వామ్యం పెంచాలని సూచించింది. ఈ సూచనలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.మధ్యాహ్న భోజన పథ కం చార్జీలను పెంచారు. రోజుకు రూ. 21 చొ ప్పున ఇంటర్ విద్యార్థులకు, రూ. 19 చొప్పు న 9, 10వ తరగతి విద్యార్థులకు, రోజుకు రూ.11.79 చొప్పున 6- 8 తరగతులకు, రోజుకు రూ.8.69 చొప్పున 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు చెల్లించాలని కమిషన్ సర్కారుకు సూచించింది.
కాంట్రాక్ట్ పద్ధతిలోనే..
ప్రభుత్వ టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమించాలని, రెగ్యులర్ నియామకాలు చేపట్టకూడదని కమిషన్ సిఫారసు చేసింది. అయితే రెం డేండ్లు ప్రొబేషనరీ, ఐదేండ్లు కాంట్రా క్ట్ పద్ధతిలోనే టీచర్లను తీసుకోవాలని సూచించింది. ఆ తర్వాత మళ్లీ టీచర్‌గా కొనసాగాలంటే టీచర్ల పనితీరు ను బట్టి, ఐదేండ్లు కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. దీనికి జిల్లా స్కూల్ బోర్డు బా ధ్యత వహిస్తుంది. ప్రతి ఐదేండ్లకోసారి టీచర్ల పనితీరును మదింపుచేసి పనితీరు సవ్యంగా లేకపోతే షోకాజ్ నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలి. పనితీరు బాగాలేని వారికి వారి వారి పనితీరును మెరుగుపరుచుకునేందుకు రెండేండ్ల సమయాన్ని ఇవ్వా లని పేర్కొంది. ఆతర్వాత పని తీరు సవ్యంగా ఉంటేనే ఉద్యోగంలో ఉం చాలి. లేదంటే ఉద్యోగం నుంచి తొలగించేలా సూచనలు చేసింది.
న్యాయపరమైన చిక్కులే..
తెలంగాణ విద్యాకమిషన్ ప్రభుత్వానికి చేసిన సిఫారసులను చెత్తబుట్టలో వేయాలి. కమిషన్ చేసిన సిఫారసులు కేంద్ర, రాష్ట్ర విద్యా విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకటో తరగతి నుంచే త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించడం హాస్యాస్పదంగా ఉన్నది. ఎన్‌సీఈఆర్టీ విధానాలు, ఎన్‌సీఎఫ్ అంశా లను ఉల్లంఘించడం ద్వారా అనేక న్యాయపరమైన వివాదాలు తలెత్తుతాయి. ఇంటర్, ఎస్‌ఎస్‌సీ బోర్డులను విలీనం చేయాలని, 12వ తరగతిలో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని కమిషన్ సిఫారసులు చేయడం సరైంది కాదు. ఎప్‌సెట్ రద్దు ప్రతిపాదన హస్యాస్పదంగా ఉంది. తన వ్యక్తిగత అభిప్రాయాలను కమిషన్ నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. ఈ కమిటీ సిఫారసులను తిరస్కరించాలి.
డా.పీ మధుసూదన్‌రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్
హక్కులపై గొడ్డలిపెట్టు
విద్యాకమిషన్ నివేదిక ప్రభుత్వ విద్యావ్యవస్థ పునాదులు దెబ్బతీసేలా ఉంది. ఇది ఉపాధ్యాయుల హక్కులపై గొడ్డలి పెట్టు. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కిం చపరచడమే. వేతనాలపై అసంబద్ధ వ్యా ఖ్యలను కమిషన్ చేసింది. ఉపాధ్యాయుల శ్రమకు అవమానం జరిగినట్లే. ఉపాధ్యాయుల వేతనాలు మార్కెట్ రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించడం అత్యంత దారుణం. రెగ్యులర్ నియామకా ల కంటే కాంట్రాక్ట్‌కు పెద్దపీట వేయడం విద్యా నాణ్యతను దెబ్బతీయడమే.
కటకం రమేశ్, టీఆర్టీఎఫ్ అధ్యక్షుడు
కట్టడి చేయాలి
నీట్, జేఈఈతోపాటు వివిధ కోర్సుల పేరుతో కోచిం గ్ ఇస్తున్న సెంటర్లపై ప్రభు త్వం చర్యలు తీసుకోవాలి. కో చింగ్‌ల పేరుతో వేలల్లో ఫీజులు వసూలు చేసి విద్యను వ్యా పారం చేశారు. కోచింగ్ సెంటర్ల నియంత్రణ, ప్రైవేట్ ఫీజులను నియంత్రించాలని విద్యాకమిషన్ చేసిన సిఫారసులను అమలు చేసి ప్ర త్యేక చట్టం తేవాలి. రాష్ట్రంలో ఉన్న కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు అసలు ఏ శాఖ పరిధిలో ఉన్నాయో స్పష్టతేలేదు. కోచింగ్ సెంటర్లను నిరోధించడంతోపాటు ప్రభుత్వమే ప్రత్యేక కో చింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమనైన కోచింగ్‌ను అందించాలి.
టీ నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
అర్థరహితం
ఉపాధ్యాయులకు పదోన్నతులు సీనియారిటీ ద్వారా కా కుండా పారామీటర్ల ద్వారా ఇవ్వాలని అనడం అర్థరహిత మం, అవగాహన రాహిత్యం. ఇ ది సర్వీస్ రూల్స్‌కు పూర్తిగా వ్య తిరేకం. దాదాపు 20 సం.లు. సర్వీస్ చేస్తే కాని పదోన్నతి రాని ఉపాధ్యాయులకు పదోన్నతి సీ నియారిటీ ప్రకారం ఇవ్వొద్దని సూచించడమేమిటి?
పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పుల్గం దామోదర్‌రెడ్డి, సుంకరి బిక్షంగౌడ్




