పదేళ్ల పాటు మీరు దోచుకున్నది చాలదా?
- రాహుల్‌గాంధీపై కేటీఆర్‌వి చిల్లర మాటలు
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి2 (విజయక్రాంతి) : పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకం అంతా పచ్చగా ఉన్నట్లు కేటీఆర్ వ్యవహారం ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని మీ నాయన, నీవు దోచుకున్నారని, ఇప్పుడు సీఎం కుర్చీలో ఎవరు కూర్చున్నా దోచుకుంటారని కేటీఆర్ భావిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలపై తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీపై కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడటం తగదని సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
బీఆర్‌ఎస్ పార్టీకి కుటుంబ పాలన తప్ప ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, జిల్లా అధ్యక్షులకు శిక్షణా తరగతులు లాంటి కార్యక్రమాలు డిక్షనరీలో లేవన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్‌ఎస్ ట్రాప్‌లో పడవద్దని, డ్రామారావు మాటలు బండి సంజయ్ పట్టించుకోవద్దన్నారు. బీఆర్‌ఎస్ చదివిన స్క్రిప్ట్‌ను బండి సంజయ్ మాట్లాడుతున్నారని విమర్శించారు.




