ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా మీరు మూటలు తీసుకెళ్లుతున్నారా?
బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలపై ఎమ్మెల్సీ అద్దంకి ఫైర్
హైదరాబాద్, మార్చి2 (విజయక్రాంతి): కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు మూటలు తీసుకొని వెళ్లుతున్నారా..? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి రాహుల్‌గాంధీ వస్తే తెలంగాణ నుంచి మూటలు తీసుకెళ్లడానికి వచ్చాడని బండి సంజయ్, కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ తెలంగాణకు రాగానే పిచ్చిపువ్వులకు పిచ్చి ముదిరిందన్నారు. కేటీఆర్ పిచ్చి, పిచ్చి కామెంట్లను మానుకోవాల ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హితవు పలికారు. బీజేపీ ఎలక్ట్రోరల్ బాండ్లు రూ. 10 వేల కోట్లు, పార్టీ ఫండ్స్ రూ. 90 వేల కోట్లు కలి రూ.లక్షకోట్లు ఉన్నాయన్నారు.




