మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో నాగుపాముల కలకలం
11-07-2026 01:55 PM
హైదరాబాద్: శనివారం హైదరాబాద్‌లోని మధురా నగర్ పోలీస్ స్టేషన్(Madhuranagar Police Station) ఆవరణలో మూడు నాగుపాము పిల్లలు కనిపించాయి. దీంతో పోలీస్ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందిన సమాచారం ప్రకారం, పాము పిల్లలు అకస్మాత్తుగా పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించడంతో సిబ్బందిలో ఆందోళన నెలకొంది. పోలీసులు వెంటనే 'ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ' సభ్యులను అప్రమత్తం చేయగా, వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ మూడు నాగుపాము పిల్లలను సురక్షితంగా రక్షించారు.






