11 July, 2026 | 12:51 PM

తెలంగాణ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు: సీఎం రేవంత్

11-07-2026 11:43 AM

హైదరాబాద్: తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, చారిత్రక భవనాల నిర్మాణానికి మార్గదర్శకత్వం వహించిన అపర భగీరథుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్(Nawab Ali Nawaz Jung Bahadur) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని ఇంజనీర్లందరికీ రేవంత్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు( Telangana Engineers Day wishes) తెలిపారు.

ప్రపంచాన్ని ముందుకు నడిపించే శక్తి ఇంజనీర్ల ఆలోచనల్లో ఉంటుందని కొనియాడారు. వారి ప్రతిభ, సృజనాత్మకత, కృషి వల్లే అసాధ్యంగా అనిపించిన ఎన్నో కలలు సాకారమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి సమస్యను ఒక అవకాశంగా మార్చే దృక్పథం, ప్రతి సవాలుకు వినూత్న పరిష్కారాలను అందించే నైపుణ్యం ఇంజనీర్ల ప్రత్యేకత అన్నారు. ఇంజనీర్ ఆలోచనలో భవిష్యత్తు ఉంటుందన్న రేవంత్ రెడ్డి ప్రతి నిర్మాణంలో సమాజ ప్రగతి ఉంటుందని సీఎం రేవంత్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.