కుప్పకూలిన హోటల్ భవనం స్లాబ్
వికారాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా మర్పల్లిలో శనివారం ఉదయం ఓ హోటల్ స్లాబ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో జేసీబీని రప్పించి పోలీసులు, సర్పంచ్ రమేష్ దగ్గరుండి శిథిలాలను తొలగిస్తూ క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చా రు. వారికి స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలించారు.
ఈ ప్రమాదంలో నాజర్ కాలు విరిగి తీవ్ర రక్తం రాగ రమేష్ తలకు బలమైన గాయాలు అయ్యా యి. చందనకు స్వల్ప గాయాలు కాగా కొట్లాపూర్‌కు చెందిన శివకుమార్ రెండు కాళ్లకు, ఛాతిపై బలమైన గాయాలయ్యాయి. వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, మోమిన్‌పేట్ సీఐతో ఘటన స్థలం చేరుకొని వివరాలు సేకరించారు. తహసీల్దార్ పురుషోత్తం మర్పల్లి ఆసు పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.






