7 June, 2026 | 1:23 AM

రాష్ట్ర విభజన వల్లే టీడీపీకి రాజీనామా

07-06-2026 12:00 AM
  1. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. అందుకే ఆ పార్టీలో చేరా   
  2. పరిపాలనలో కామన్‌సెన్స్ ముఖ్యం    
  3. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో నేర్చుకున్నా
  4. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి) : రాష్ట్ర విభజనతో పాటు స్థానిక కారణాల వల్ల టీడీపీకి రాజీనామా చేశానని, ఆనాడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా బలమైన పోరాటం కావాలని ప్రజలు కూడా భావించారని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ సమయంలో నా ఎదుట ఎన్నో మార్గాలున్నా యని, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నెరవేర్చిన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకు న్నానని తెలిపారు.

2026 జూలైతో నా ప్రజాజీవితం 20 ఏళ్లు పూర్తవుతుందని, నా రాజకీయ జీవితమంతా ప్రజలు, సామాన్యుల కోసం పోరాడానని, నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదని చెప్పారు. శనివా రం బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లా డారు. గతంలో రాష్ట్రాన్ని పాలించే అవకాశం వచ్చిన వారు పాలకులుగా భావించారు.. నే ను సేవ చేయడానికి వచ్చిన ప్రజా ప్రతినిధిగా భావించానని చెప్పారు.

నిరుద్యోగ స మస్యను కేసీఆర్ పరిష్కరించలేదని, గతంలో ఒక ఆర్‌ఎంపీ డాక్టర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఉన్నారని, ఇంజినీరు, డాక్టర్, ఇతర నియామకాలు చేసే వ్యక్తి ఓ ఆర్‌ఎంపీ డాక్టరా? అని ప్రశ్నించారు. యూ పీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీలో నియామక ప్రక్రియను అమలు చేశామని తెలిపారు. 15 నెలల్లో 67,760 ఉద్యోగాలు ఇచ్చామని, రెండు వారాల క్రితం నోటిఫికేషన్లు ఇచ్చాం.. త్వరలోనే 5 వేల పోలీసు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ప్రక టించారు.

తెలంగాణకు సంబంధించి మాకు సమగ్రమైన ప్రణాళిక ఉందని, 160 కిలో మీటర్ల ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని నగర ప్రాంతాన్ని క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ), ఓఆర్‌ఆర్- మధ్య ప్రాంతాన్ని ప్యూర్ (పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ), ఆర్‌ఆర్‌ఆర్ వెలుపల ప్రాంతాన్ని రేర్ (రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ)గా పెట్టుకున్నామని తెలిపారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, చెప్పారు. 

ప్రధాని మోదీ, పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడతో చర్చించి 12 వరుసలతో రహదారితో మచిలీపట్నం ఓడరేవును, రోడ్డు, రైలు, ఓడరేవు, విమానాశ్రయంతో అనుసంధానించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఏఐతో వైట్ కాలర్ జాబ్‌లు పోతున్నాయని, అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. 1950లో ఐటీఐలు ఏర్పాటు చేశామని, అందులో కాలం చెల్లిన కోర్సులు ఉన్నాయని, వాటిలో ఇంకా అంబాసిడర్ కారు రిపేర్ నేర్పుతున్నారు..

రిపేర్ చేయడానికి అంబాసిడర్ కార్లు ఎక్కడ ఉన్నాయని, ఒకే ఒక్క కారు కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉందని ఎద్దేవా చేశారు. వాళ్ల ఎన్నికల గుర్తు అంబాసిడర్ కారు.. ఎవరైనా ఆ కారును రిపేర్ చేయాలంటే ఫాంహౌస్‌కు వెళ్లాలన్నారు. మేం బ్లూ కాలర్ జాబ్లు సృష్టిస్తున్నామని,  ఇప్పుడు ఐటీ ఇంజినీర్ కన్నా బ్లూ కాలర్ జాబ్ చేసే వాళ్లు ఎక్కువ సంపాదిస్తున్నారని, ఆయా దేశాల్లో పని చేసేలా జర్మన్, జపాన్, కొరియన్ భాషలు నేర్పిస్తున్నామని వెల్లడించారు.  నాకు ఏఐ అంటే భయం లేదన్నారు.  

త్వరలోనే చైనాకు..   

నేను ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవడానికి మోహమాట పడనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హార్వర్డ్‌లో పది రోజులు కోర్సు చేశానని, త్వరలోనే నేను చైనా సందర్శించి ఉత్తమమైన పద్ధతులను తెలుసు కుంటానని పేర్కొన్నారు.  ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎంతో తెలుసుకున్నానని, అం దుకే నన్ను ఎవరూ తప్పుదోవ పట్టించలేరన్నారు.

చెరువులు, నాలాలను పెద్దవాళ్లు  చెరబడుతున్నారని, అందుకే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఢిల్లీ, ముంబ యి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో ఆక్రమణలకు సంబంధించి సొంత మోడల్‌ను అనుసరించాలన్నారు. ప్రధానమంత్రి మోదీ మహిళా రిజర్వేషన్ల పేరుతో రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నారని, పార్లమెంట్  సీట్ల పెంపును మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టడాన్ని మేం వ్యతిరే కిస్తున్నామన్నారు.