7 June, 2026 | 1:27 AM

కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు

07-06-2026 12:00 AM
  1. మా ఫోన్లు ట్యాప్ చేయడం ఆయనకు లెక్కే కాదు
  2. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
  3. సిట్ ఎదుట హాజరైన ఎంపీ

హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి) : సొంత కుటుంబంలో ఉన్నవారి ఫోన్లనే ట్యాప్ చేయించిన కేసీఆర్‌కు.. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్, బండి సంజయ్, నా ఫోన్లను ట్యాప్ చేయించడం ఒక లెక్కే కాదని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు. ఆయన స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. గతం లో చామల ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. 

అనంతరం చామల కిరణ్ మీడియాతో మాట్లాడుతూ..  తాను మీడియా కమి టీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఫోన్ ట్యాప్ అయిందని సిట్ అధికారులు చెప్పారని తెలిపారు. ఆ సమయంలో పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డికి దగ్గరగా ఉండటం వల్లే తన ఫోన్‌ను ట్యాప్ చేశారన్నారు.  నేతలతో మా ట్లాడే విషయాలన్నీ తెలుసుకునేవారన్నారు.   అధికారం కోసం కేసీఆర్ ఏమైనా చేస్తారని దుయ్యబట్టారు.