ఇందిరమ్మ ఇల్లు కావాలంటే.. ఖర్చు పెట్టాల్సిందేనా?

28-09-2026 | 09:48am

భిక్కనూర్, సెప్టెంబర్‌ 28 (విజయక్రాంతి): భిక్కనూర్‌ మండలం(Bhikkanur Mandal) ఇస్సన్నపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకం(Indiramma houses) కింద ఇటీవల విడుదలైన జాబితాలో 12 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే గృహ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించాలంటే కమిటీ సభ్యులు లబ్ధిదారుల నుంచి రూ.3,000 నుంచి రూ.4,000 వరకు రుసుములు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయితే ఆదివారం భూమిపూజ నిర్వహించేందుకు వెళ్లిన సభ్యులు రూ.3,000 ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో లబ్ధిదారులతో పాటు వారి బంధువులు కమిటీ సభ్యులను నిలదీసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై కమిటీ సభ్యుల మధ్య కూడా విభేదాలు, గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. లబ్ధిదారుల నుంచి రుసుము(Commissions) ఎందుకు వసూలు చేస్తున్నారు? అనేది తెలియాల్సి ఉంది.వెంటనే అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు