11 March, 2026 | 7:01 PM

పంతులమ్మ ఇంకా మారిన కలెక్టర్

11-03-2026 05:17 PM

లక్ష్మణ్ చందా,(విజయక్రాంతి): లక్ష్మణ్ చందా మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పొట్లపల్లి పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. తరగతి గదిలోకి వెళ్లి బోర్డుపై లెక్కలు రాసి సమాధానాలను రాబట్టారు. చిన్నారి విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి బాగా చదువుకోవాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు.