11 March, 2026 | 7:01 PM

కళ్ళకు కాటుక విషయంలో జాగ్రత్త పడాలి

11-03-2026 05:22 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఇప్పటికీ చిన్న పిల్లల విషయంలో కొన్ని మూఢనమ్మకాలను పాటిస్తూ కాటుక కళ్ళకు రుద్దడం వల్ల పిల్లలకు కంటి జబ్బులు చూపే ప్రమాదం ఉందని పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ నాళం స్వప్న పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వివిధ పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్న పిల్లలు, నవజాత శిశువులకు తల్లిదండ్రులు కళ్ళకు కాటుక రుద్దడం వల్ల కంటి ఇన్ఫెక్షన్ వ్యాధులు వస్తున్నాయని ఇది పిల్లలకు చాలా ప్రమాదకరమని తెలిపారు.

కాటుకలో వినియోగించుకునే రసాయన కెమికల్ కారణంగా కళ్ళ నుంచి నీళ్లు కారడం ఇన్ఫెక్షన్ గురి కావడం ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు కాటుకను కండ్లకు రుద్ద వద్దని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది తల్లులు తమ పిల్లలకు దిష్టి తగులుతుందని మూఢనమ్మకంతో కళ్ళకు చెంపలకు అరిచేతికి నుదుటిపై కాటుకను ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నారని అన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు