7 March, 2026 | 3:47 PM

పిహెచ్‌సీ అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం.

07-03-2026 12:52 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తెల్కపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో ఉన్న అపరిశుభ్రతను గమనించిన కలెక్టర్ వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో తొలి థీమ్‌గా చేపట్టాల్సిన పరిశుభ్రత కార్యక్రమాలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు.