calender_icon.png 5 February, 2026 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

50 పడకల ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

05-02-2026 12:00:00 AM

ఎర్రుపాలెం ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): బుధవారం నాడు ఎర్రుపాలెం మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఎర్రుపాలెం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 50 పడకల ఆసుపత్రిని పరిశీలించారు. తహసిల్దార్ మన్నే ఉషా శారద, ఎంపీడీవో బి సురేందర్, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండా నర్సింహారావుతో కలసి నిర్మాణంలో ఉన్న 50 పడకల ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన పనులను  అధికారులను అడిగి తెలుసుకున్నారు . వీరి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ నండ్రు అశ్విని, ఉపసర్పంచ్ ఎస్ కే శాబాష్, పలువురు అధికారులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.