2 July, 2026 | 4:57 PM

Breaking News

ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •   "స్క్రాప్" పై అంత ప్రేమెందుకు..?   •   ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన   •   యువత సమాజ సేవలో ముందుండాలి   •   పీ ఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి....   •   రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేపించిన ఎమ్మెల్యేకు పాలాభిషేకం   •   పట్టా ఉన్న రైతులకు భూమి అప్పగించాలి: సేవాలాల్ సేన   •   చెట్టే శాపమైందా..? ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు పగుళ్లు   •  

రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు

13-05-2026 06:45 PM

 జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం దిలావార్ పూర్ టోల్ ప్లాజా, లోకేశ్వరం మండలంలోని పలు రైస్ మిల్లులను ఆయన స్వయంగా సందర్శించి ధాన్యం అన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మిల్లులకు చేరుకున్న లారీలను 24 గంటల్లోపు తప్పనిసరిగా అన్‌లోడింగ్ పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కటింగ్‌లు, అక్రమ కోతలు అనుమతించబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

హమాలీల కొరత ఉన్న ప్రాంతాల్లో వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ధాన్యం దిగుమతిలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే పీపీసీలు, రవాణా విభాగం, రైస్ మిల్లుల మధ్య సమన్వయం కొనసాగించాలని ఆదేశించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని త్వరితగతిన అన్‌లోడింగ్ చేసి వారికి ఇబ్బందులు కలగకుండా చూడటం అధికారుల బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, సివిల్ సప్లై అధికారులు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్ సూర్యరావ్ తదితరులు పాల్గొన్నారు.