గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత
గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి 15000 ప్రోత్సాహక బహుమతి అందజేత
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి) : మండలంలోని జెడ్పిహెచ్ఎస్ గోపాల్పేట పాఠశాల 2025-26 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో అత్యధిక మార్పులు సాధించిన మనోహర్ విద్యార్థికి గొర్తి ఈశ్వర ట్రస్టు వారు 15000/- ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.గొర్తి ఈశ్వర ట్రస్ట్ అధ్యక్షులు పవన్ కుమార్ గతంలో నాగిరెడ్డిపేట్ మండలంలో 1995 సంవత్సరంలో ఎంపీడీవోగా వారి సతీమణి ఉషామాల ఉపాధ్యాయులుగా సేవలందించారు.ప్రస్తుతం వారు 14 సంవత్సరాల నుండి కాశీలో నివాసం అంటూ గొర్తి ఈశ్వర ట్రస్ట్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న పాఠశాలలో అక్కడినుండే పర్యవేక్షిస్తున్నారు.ఈ సందర్భంగా ట్రస్టు తరఫున ఉపాధ్యాయురాలు కవితను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో గోపాల్పేట గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్, ఎంపీవో ప్రభాకర్ చారి,గొర్తి ఈశ్వర ట్రస్ట్ బాధ్యులు తిరుపతిరెడ్డి,మూర్తి,చౌదరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






