యువత సమాజ సేవలో ముందుండాలి
02-07-2026 04:47 PM
సీహెచ్ రాంబాబు పిలుపు
గుండాల, (విజయక్రాంతి): యువత సమాజ సేవలో ముందుండాలని, సాటి వారికి సాయపడాలని, గ్రామాల అభివృద్ధికి గ్రామ స్వరాజ్యంకై కృషి చేయాలని జిల్లా యువజన సంఘాల అధికారి సీహెచ్ రాంబాబు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన ఆయన యువజన సంఘాల ఏర్పాటు ఆవశ్యకత గురించి వివరించారు. యువజన సంఘంగా యువత ఏర్పడాలని, తద్వారా ప్రజల అభివృద్ధి కోసం సమాజంలోని అంతరాలను రూపుమాపడానికి ప్రయత్నించాలని, తన సహకారం యువతకు ఉంటుందని పేర్కొన్నారు. యువజన సంఘ సభ్యత్వం నమోదు చేసుకోవడానికి నవ చైతన్య యూత్ సభ్యులు కందుకూరి సంతోష్ 9177075070 ను సంప్రదించాలని ఆయన తెలిపారు.






