28 August, 2026 | 2:09 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

11-04-2026 07:21 PM

నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.