16 June, 2026 | 9:42 PM

ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్

16-06-2026 08:50 PM

కొండపాక: కొండపాకలోని ప్రసిద్ధి చెందిన అతి పురాతనమైన రుద్రేశ్వరాలయాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి మంగళవారం సాయంత్రం సందర్శించారు. రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా ఆలయ నిర్వాహకులు కలెక్టర్ ను ఆలయ మర్యాదలతో సత్కరించారు. రుద్రేశ్వరాలయ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనంతుల శ్యామ్ మోహన్ ట్రస్ట్ సభ్యుడు ఆర్ బాలయ్య తదితరులున్నారు.